కరుణించని వరణుడు
వర్షం లేక ఎండిపోతున్న మొక్క జొన్న
అప్పుల్లో కూరుకుపోతున్నామంటూ రైతుల ఆవేదన
వెలి జర్ల ,తోకరెగడి తండా లో సంఘటనా
ప్రభుత్వపరంగా నష్టపరిహారంగా ఆదుకోవాల్సిందిగా వేడుకోలు
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్ / ఆగష్టు 25: షాద్ నగర్ నియోజకవర్గం పరిధిలోని వరుణుడు కరుణించక పోవడంతో రైతన్నలు దిగులు చెందుతున్నారు. వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో మొక్క జొన్న, పత్తి పంట ఎండిపోతున్నాయి. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టిమిట్టాడుతున్నారు. ఓవైపు అప్పులు చేసి వ్యవసాయం జీవనాధారంగా కొనసాగిస్తున్న తరుణంలో వరుణుడు కనికరించక పోవడంతో అప్పుల ఊబిలో కూరుకు పోతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు కష్టలను కడ తీర్చాల్సిన ప్రభుత్వాలు రైతుబంధు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంటున్నాయని మండిపడ్డారు. ఆరుగాలం శ్రమించి పంటలను సాగు చేసే క్రమంలో వర్షం లేకపోవడంతో తమ శ్రమ వ్యర్థం అయిందని వాపోతున్నారు.
ఫరూఖ్ నగర్ మండలం వెలిజర్ల గ్రామానికి చెందిన తొకరెగడి తండా గిరిజన వాసి కేతవత్ రాజు, సత్తిరెడ్డి, వట్టేల మహేష్ రైతులు తీవ్రంగా నష్టపోతున్నామని అన్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ వర్షాలు అధికంగా ఉంటాయని ఆశాభావంతో లక్షలు వెచ్చించి పెట్టుబడులు పెట్టి వ్యవసాయం సాగు చేసాం. తీరా చూస్తే వర్షాలు లేకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోతూ చివరకు చావే శరణ్యం అంటూ రైతులు ఆవేదనను వెళ్లగక్కుతున్నారు. స్థానిక ప్రజాప్రతితులు నాకు సహాయ సహకారాలు అందించాలని తమ గోడును వెలిబుచ్చారు.ఉన్నతాధికారులు, వ్యవసాయ అధికారులు స్పందించి నష్టపోయిన రైతులను గుర్తించి ప్రభుత్వపరంగా నష్టపరిహారంగా సహాయ సహకారాలు అందించాలని కోరారు.