తెలంగాణ పోలీసులు దేశంలోనే నెంబర్‌ వన్‌

Get real time updates directly on you device, subscribe now.

శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీస్ నెంబర్ వన్..
హ్యూమన్ రైట్స్ టుడే/రంగారెడ్డి జిల్లా/ఆగస్టు 24:
రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీసులు దేశంలోనే నెంబర్‌ వన్‌ అని రాష్ట్ర హోంమంత్రి మహముద్‌ అలీ అన్నారు.

నూతనంగా నిర్మించిన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ను చేవెళ్ల ఎంపీ రంజిత్‌ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్‌ గౌడ్‌, డీజీపీ అంజనికుమార్‌, సీపీ స్టీఫెన్‌ రవీంద్రతో కలిసి గురువారం ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం జనాభా పెరుగుదలకు అనుకూలంగా నూతన పోలీస్‌ స్టేషన్లను నిర్మిస్తున్నదని అన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్‌ పోలీసు వ్యవస్థను పటిష్ట పరిచారని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేనటువంటి కమండ్‌ కంట్రోల్‌ వ్యవస్థను హైదరాబాద్‌ నడిబొడ్డులో ఏర్పాటు చేశామని వెల్లడించారు.

ప్రభుత్వ హయాంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు , కర్ఫ్యూలు జరగలేదంటే పోలీసుల పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందని పేర్కొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment