తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకోనున్నారు…
ఖమ్మంలో బీఆర్‌ఎస్ భారీ బహిరంగ సభ కోసం ఖమ్మం వెళ్లనున్న ముఖ్యమంత్రులు…
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/ 16 జనవరి 2023: ఈ నెల 18న యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సందర్శించనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకోనున్నారు. ఖమ్మంలో బీఆర్‌ఎస్ భారీ బహిరంగ సభ కోసం ఖమ్మం వెళ్లనున్న ముఖ్యమంత్రులు దారిలో యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకోనున్నట్టు సమాచారం. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. ముఖ్యమంత్రుల పర్యటన తరుణంలో అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ప్రెసిడెన్షియల్ సూట్స్, హెలిప్యాడ్ స్థలాన్ని రాచకొండ కమిషనర్ దేవేంద్ర సింగ్ చౌహాన్ పరిశీలించారు.
18వ తేదీన ఉదయం 11 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి యాదాద్రికి ముఖ్యమంత్రులు 2 ప్రత్యేక హెలిక్యాప్టర్లలో యాదాద్రికి బయల్దేరనున్నారు. ఈ క్రమంలో 11.30 గంటలకు యాదాద్రి కి చేరుకోని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించి ఆ తరువాత 12.30 గంటలకు యాదాద్రి నుంచి ఖమ్మం బయలుదేరుతారు.