డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించిన హైకోర్టు
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/ఆగస్టు 24:
తెలంగాణలో మరో ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు గురువారం సంచలన తీర్పు వెలువరించింది.
గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డికి షాక్ తలిగింది. ఎమ్మెల్యేగా ఆయన్ని అనర్హుడిగా ప్రకటించింది తెలంగాణ హైకోర్టు.
తప్పుడు అఫిడవిట్ సమర్పించారని ఆయనపై వేటు వేసింది. ఆయన ఎన్నిక చెల్లదంటూ సంచలన తీర్పు ఇచ్చింది. అదే సమయంలో ఎన్నికల్లో తర్వాతి మెజార్టీతో ఉన్న డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించింది.
కృష్ణమోహన్‌రెడ్డికి 3 లక్షల జరిమానా విధిస్తూ అందులోంచి రూ.50 వేలు డీకే అరుణకు ఇవ్వాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.