బైక్ షోరూం లో అగ్ని ప్రమాదం?
హ్యూమన్ రైట్స్ టుడే/విజయవాడ/ఆగస్టు 24:
విజయవాడలో గురువారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కెపి నగర్ ప్రాంతంలోని స్టెల్లా కాలేజీ సమీపంలో ఉన్న టీవీఎస్ షోరూమ్‌లో మంటలు చెలరేగడంతో షోరూమ్‌తో పాటు గోదాములో ఉన్న 300 వరకు బైకులు దగ్ధం అయ్యాయి.
షోరూం మొదటి అంతస్తులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకోవడంతో కొద్ది సేపటికే గోదాము మొత్తం వ్యాపించాయి.
అనంతరం పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా..
ఘటన స్థలానికి చేరుకున్న వారు మంటలను అదుపులోకి తీసుకున్నారు. అయితే.. షోరూమ్‌లో సాధారణ టూ విల్లర్లతో పాటు, ఎలక్ట్రిక్ బైక్స్ కూడా ఉండడంతో ఇంత ప్రమాదం వాటిల్లిందని అగ్ని మాపక సిబ్బంది చెబుతున్నారు.
దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ పెట్టడం వల్ల షార్ట్ సర్క్యూట్ ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.