ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత్

Get real time updates directly on you device, subscribe now.

అమన్ ప్రీత్ కు ప్రపంచ షూటింగ్ ఛాంపియన్ షిప్ లో స్వర్ణం..

హ్యూమన్ రైట్స్ టుడే/బాకు అజర్‌బైజాన్‌/ఆగస్టు 24:
ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత షూటర్లు మరోసారి సత్తా చాటుకున్నారు.

పురుషుల 25 మీటర్స్‌ స్టాండర్డ్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో అమన్‌ప్రీత్‌ సింగ్‌ భారత్‌కు స్వర్ణం అందించగా.. మహిళల 25 మీటర్ల స్టాండర్డ్‌ పిస్టల్‌ పోటీల్లో టియాన, యషిత షోకీన్‌, కృతిక బృంధం కాంస్యం గెలుచుకున్నారు. దాంతోపాటు ఈ మెగా ఈవెంట్‌లో భారత్‌ మొత్తంగా 5 స్వర్ణాలు, 4 కాంస్యలతో మెడల్స్‌ పట్టికలో రెండో స్థానంలో నిలిచింది.

చైనా 13 స్వర్ణాలు, 6 రజతాలు, 5 కాంస్య పతకాలు గెలుచుకొని అగ్ర స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు అమెరికా 4 స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యంతో మూడో స్థానం దక్కించుకుంది.

బుధవారం ఇక్కడ జరిగిన పురుషుల వ్యక్తిగత విభాగం 25 మీటర్ల స్టాండర్డ్‌ పిస్టల్‌ పోటీల్లో అమన్‌ప్రీత్‌ సింగ్‌ (577) షూటింగ్‌ పాయింట్లతో అగ్ర స్థానంలో నిలిచి భాతర్‌కు 5వ బంగారు పతకాన్ని అందించాడు.

అమన్‌ కంటే మూడు పాయింట్లు తక్కువగా చేసిన కొరియా షూటర్‌ లీ గునియోక్‌ (574)తో రజతం సొంతం చేసుకున్నాడు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment