చందమామ అందిన రోజు..
హ్యూమన్ రైట్స్ టుడే/శ్రీహరికోట/ఆగస్టు 24:
చంద్రయాన్-3 ల్యాండింగ్ అనంతరం విక్రమ్ ల్యాండర్ తొలిసారి చంద్రుడి చిత్రాలను తీసింది.
విక్రమ్ తీసిన ఫోటోలను ఇస్రో తన అధికారిక ఎక్స్ ట్విట్టర్ హ్యాండిల్‌లో ట్వీట్ చేసింది. బెంగళూరు ఇస్రో కేంద్రంతో చంద్రయాన్-3 ల్యాండర్ అనుసంధానమైంది.
ఇదిలా ఉండగా, ల్యాండర్ నుండి రోవర్ బయటకు వచ్చిన తర్వాత సెకనుకు సెంటీమీటర్ వేగంతో కదులుతుంది.
ఇస్రో సాధించిన ఘనతకు గుర్తుగా చంద్రుడి ఉపరితలంపై ప్రగ్యాన్ రోవర్ దేశ జాతీయ చిహ్నంతో పాటు ఇస్రో లోగోను ముద్రించనుంది.
ఇందుకు తగినట్లు రోవర్ ఆరు చక్రాలను డిజైన్ చేశారు. ఇందులో కుడి చక్రాలు ఇస్రో లోగోను, ఎడమవైపు చక్రాలు జాతీయ చిహ్నాన్ని ముద్రిస్తాయి.పద్నాలుగు రోజుల పాటు చంద్రుడి ఉపరితలంపై ప్రగ్యాన్ రోవర్ సంచరిస్తూ ల్యాండర్‌కు కమ్యూనికేట్ చేస్తుంది.
ప్రగ్యాన్ రోవర్‌లోని రెండు పేలోడ్‌లు చంద్రుడిపై ఉన్న వాతావరణ పరిస్థితులు, ఉపరితల నిర్మాణం వంటి అంశాలను పరిశీలిస్తాయి. అలాగే మట్టి, రాళ్లలో ఉన్న రసాయనాలను గుర్తించి సమాచారాన్ని విశ్లేషిస్తాయి.