విశ్వవ్యాప్తంగా కోట్లాదిమంది కళ్లప్పగించి చూస్తుండగా మన విక్రముడు వినమ్రంగా చంద్రుడిపైకి అడుగుపెట్టాడు..

Get real time updates directly on you device, subscribe now.

భారత్ ఖ్యాతిని సగౌరవంగా చాటుదాం: సోమనాథ్ ఇస్రో చైర్మన్

హ్యూమన్ రైట్స్ టుడే/శ్రీహరికోట /ఆగస్టు 23:
చంద్రుడి దక్షిణ ధ్రువంమీద అడుగుడిన తొలి దేశంగా భారత్‌ ఖ్యాతిని సగర్వంగా సాధించుకుంది. చంద్రయాన్‌ -3 ఈ ఘనతను సాకారం చేసింది. విశ్వవ్యాప్తంగా కోట్లాదిమంది కళ్లప్పగించి చూస్తుండగా మన విక్రముడు వినమ్రంగా చంద్రుడిపైకి అడుగుపెట్టాడు. శాస్త్రవేత్తల మోముల్లో ఆనందం వెల్లివరిసింది. ఆ క్షణాన భరతమాత తలఎత్తుకు నిలిచింది. ప్రపంచం మనవైపు తేరిపార చూసింది.

అలా మనవైపు చూసేలా చేసిన చంద్రయాన్‌ వెనుక ప్రధానంగా తొమ్మిదిమంది శాస్రవేత్తల బృందం పనిచేసింది. వీరిలో ఆరుగురు అత్యంత కీలక పాత్ర వహించారు. వేయిమంది యువ ఇంజనీర్లు, 53మంది మహిళా శాస్త్రవేత్తలు చేయందించారు. నాసా, యూరోపియన్‌ యూనియన్‌ స్పేస్‌ ఏజెన్సీ నుంచి స్టార్టప్‌ల వరకు ఈ విజయంలో పాలుపంచుకున్నాయి. దాదాపు రూ. 700 కోట్ల ఈ ప్రాజెక్టులో ఎవరేమి చేశారో చూద్దాం.


*టీమ్‌ చంద్రయాన్‌*
*1 ఎస్‌.సోమనాథ్‌ ఇస్రో చైర్మన్‌*


చంద్రయాన్‌ 3లో ఉపయోగించిన వ్యోమనౌక మార్క్‌ 3. దీనిని బాహుబలి రాకెట్‌గా అభివర్ణిస్తారు. చంద్రుని కక్ష్యలోకి ల్యాండర్‌ను మోసుకెళ్లిన బాహుబలి రాకెట్‌ను డిజైన్‌ చేసింది ఏరోస్పేస్‌ ఇంజనీర్‌ ఎస్‌.సోమనాథ్‌. ఆయన పేరు సోమనాథ్‌. చంద్రుడిని సోముడు అని కూడా పిలుస్తారు. ఆయన పేరులోనే చంద్రుడి పేరుండటం కాకతాళీయం. చంద్రయాన్‌ 3 ప్రాజెక్టుకు ఆయన బాధ్యత వహించడం విశేషం. ఆయన బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌లో విద్య అభ్యసించారు. సంస్కృతంలో మాట్లాడగల నేర్పు ఆయన సొంతం. యానమ్‌ అనే శీర్షికతో వచ్చిన చిత్రంలో ఆయన నటించారు కూడా. ఈసారి చంద్రుడి దక్షిణధ్రువంమీద అడుగుపెట్టాల్సిందేనన్న పట్టుదలతో టీమ్‌ను అనుక్షణం ప్రోత్సహిస్తూ వచ్చారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment