కూన శ్రీశైలం గౌడ్ అరెస్ట్!!జీడిమెట్ల పారిశ్రామిక వాడ సూపర్ మాక్స్ కంపెనీ వద్ద కార్మికుల సమస్యలపై…
హ్యూమన్ రైట్స్ టుడే/బషీరాబాద్/ఆగస్టు 23:
సీఎం మెదక్ జిల్లాలో పర్యటన కోసం కుత్బుల్లాపూర్ మీదుగా వెళ్లనున్న నేపథ్యంలో ముందస్తు చర్యలుగా మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ జీడిమెట్ల పోలీసులు అరెస్ట్ చేశారు.
జీడిమెట్ల పారిశ్రామిక వాడ సూపర్ మాక్స్ కంపెనీ వద్ద కార్మికుల సమస్యలపై మాట్లాడడానికి వచ్చిన ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత కొన్ని నెలలుగా సూపర్ మాక్స్ కంపెనీ కార్మికులు తమ సమస్యలపై పరిశ్రమ ముందు నిరవధిక దీక్ష చేస్తున్నారు.
ఈ క్రమంలో బుధవారం సీఎం కేసీఆర్ జీడిమెట్ల మీదుగా మెదక్ వెళ్తున్నారని తెలుసుకున్న కార్మికులు ఆయనకు మెమోరండం ఇవ్వడానికి సిద్ధమైనట్లు తెలుసుకున్న పోలీసులు కార్మికులను కంపెనీ లోపలికి పంపించి బయటకు రాకుండా చేస్తున్నారని తెలుసుకున్న కూన శ్రీశైలం గౌడ్ కార్మికుల తరఫున మాట్లాడటానికి అక్కడికి వెళ్లారు.
దీంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకొని బాచుపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రజాకర్ల పాలన కొనసాగుతుందని దుయ్యబట్టారు.