బేగంపేట సమీపంలో రన్నింగ్ కారులో మంటలు..
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/ఆగస్టు 23:
బేగంపేటలో రన్నింగ్ కారులో మంటలు చెలరేగాయి.
అయితే ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. AP10 ax 8994 నెంబర్ గల మారుతి సుజికి Sx4 కారు ప్రయాణీకులతో వెళుతోంది. కారు ఇంజన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన కారు డ్రైవర్ వెంటనే కారును నిలిపివేశాడు.
ఆ దారిలో వెళుతున్నవారు మంటలను అదుపు చేశారు. అనంతరం డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తెల్లవారుజామున పంజాగుట్ట నుంచి బేగంపేట్ వెళుతుండగా ఈ ఘటన జరిగింది. కారులో ప్రయాణిస్తున్న వారు సేఫ్. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.