మద్యం మత్తులో ముగ్గురిని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు
హ్యూమన్ రైట్స్ టుడే/వనపర్తి జిల్లా/ఆగస్టు 23:
మద్యం మత్తులో ఆర్టీసీ బస్సు నడిపి రోడ్డుపై నిలుచున్న ముగ్గురు వ్యక్తులను ఢీ కొట్టిన సంఘటన కొత్తకోట మండలలోని కానాయపల్లి గ్రామ స్టేజి దగ్గర చోటు చేసుకుంది.
ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఆత్మకూరు నుండి వనపర్తి వెళుతున్న ఆర్టీసీ బస్సు (టిఎస్ 32 టి 5194 ) డ్రైవర్ తాగిన మత్తులో బస్సు నడుపుకుంటూ వచ్చి బుగ్గపల్లి తండాకు చెందిన సేవ్య నాయక్, మల్లేష్ , అనిల్ రోడ్డు పక్కన మాట్లాడుకుంటుండగా ఆర్టీసీ డ్రైవర్ బస్సుతో వారిని ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి.
ఈ ఘటనలో సేవ్యా నాయక్ కుమారుడైన మల్లేష్ నాయక్‌కు కాలు విరిగిపోయిందని స్థానికులు తెలిపారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ పారిపోయినట్లు స్థానికులు తెలిపారు.
క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో వనపర్తి జిల్లా ఆస్పత్రికి తరలించారు.