సీపీగెట్ ఫలితాలు విడుదల..
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/ఆగస్టు 22: తెలంగాణలోని విశ్వవిద్యాలయాలతోపాటు జేఎన్‌టీహెచ్‌లోని పీజీ సీట్ల భర్తీకి నిర్వహించిన కామన్ పీజీ ప్రవేశ పరీక్ష (CPGET) ఫలితాలు విడుదలయ్యాయి.
ఈ పరీక్షల్లో 93.42 శాతం మంది క్వాలిఫై అయ్యారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆర్ లింబాద్రి, ఓయూ వీసీ డీ రవీందర్ ఫలితాలను విడుదల చేశారు. ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన, తెలంగాణ మహిళా యూనివర్సిటీలతోపాటు హైదరాబాద్ జేఎన్‌టీయూలో పీజీ, ఇంటిగ్రేటెడ్ పీజీ, పీజీ డిప్లొమా కోర్సులలో ప్రవేశాల కోసం ఈ పరీక్ష నిర్వహించారు.
కాగా, CPGET -2023 పరీక్షలను జూన్ 30 నుంచి జూలై 10 వరకు కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహించారు. ఈ పరీక్షకు 22,468 మంది పురుషులు, 45,954 మంది మహిళలు సహా మొత్తం 68,422 మంది దరఖాస్తు చేసుకున్నారు.
అందులో 19,435 మంది పురుషులు, 40,230 మంది మహిళలు సహా మొత్తం 59,665 మంది పరీక్షలు రాశారు. వారిలో 18,172 మంది పురుషులు, 37,567 మంది మహిళలు సహా మొత్తం 55,739 మంది క్వాలిఫై అయ్యారు.
అభ్యర్థులు ఫలితాల కోసం cpget.tsche.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.