ఎన్నికల బరిలో కిషన్‌రెడ్డి సతీమణి?
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/ఆగస్టు 22:
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే అభ్యర్ధుల జాబితాను ప్రకటించాలనుకుంటుంది. ఇటీవల ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్ అభ్యర్ధుల తొలిజాబితాను అధిష్టానం ప్రకటించింది. మరో వారం, పది రోజుల్లో తెలంగాణ , రాజస్థాన్ అభ్యర్థుల జాబితాను కూడా విడుదల చేయనుంది.
అయితే ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు గణనీయమైన సీట్లు కేటాయించాలనుకుంటున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. నార్మల్‌గా ఈసారి ఎన్నికల బరిలోకి వెళితే తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఎదుర్కోవడం కష్టం. అందుకే ఈసారి పూర్తి భిన్నమైన వ్యూహాలను అనుసరించాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది.
మొత్తం 119 అసెంబ్లీ స్థానాలను ఏ, బి, సి అనే మూడు కేటగిరీలుగా విభజించనుంది. మొదటి కేటగిరీలో ఇప్పటి వరకూ గెలిచిన స్థానాలు, రెండో కేటగిరీలో గత ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన స్థానాలు, మూడో కేటగిరిలో ఇప్పటివరకూ గెలవని స్థానాలను ఉంచబోతున్నారు.
గత ఎన్నికల్లో రెండో స్థానంలో వచ్చిన స్థానాలపై ఎక్కువ ఫోకస్ పెట్టాలని.. ఈ స్థానాల్లోనే ప్రధాని మోదీ, అమిత్ షా వంటి దిగ్గజాల పర్యటనలు ఉండేలా చూసుకోవాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది.
ఈ మూడు కేటగిరీలకు సంబంధించిన జాబితా ఇవ్వాలని రాష్ట్ర బీజేపీని అధిష్టానం అడిగినట్లు సమాచారం. అది అందిన వెంటనే బీజేపీ సెంట్రల్ ఎన్నికల కమిటీ భేటీలో అభ్యర్థుల జాబితాను ఖరారు చేయనున్నారు.