మహిళా బిల్లును ఎందుకు ఆమోదించడం లేదు: ఎమ్మెల్సీ కవిత

Get real time updates directly on you device, subscribe now.

చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ ఎక్కడ: కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/ఆగస్టు 22:
చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తామని బీజేపీ రెండుసార్లు హామీ ఇచ్చి మోసం చేసిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు.

పార్లమెంటులో భారీ మెజారిటీ ఉన్నప్పటికీ మహిళా బిల్లును ఎందుకు ఆమోదించడం లేదని నిలదీశారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.

బీఆర్ఎస్ టికెట్ల పంపిణీపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత సామాజిక మాధ్యమం ఎక్స్‌ ట్విట్టర్‌ వేదికగా ఆగ్రహం వ్యక్తంచేశారు.


స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం ఉంది కాబట్టే దేశంలో 14 లక్షల మంది మహిళలు స్థానిక సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారని తెలిపారు.

చట్టసభల్లోనూ రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం తీసుకురానిదే పరిస్థితుల్లో మార్పు సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో జరిగే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌తోపాటు ఇతర పార్టీలు మహిళలకు ఎన్ని టికెట్లు కేటాయిస్తాయో చూద్దామన్నారు.

బీఆర్ఎస్ పార్టీ టికెట్ల పంపిణీపై వెళ్లగకుతున్న అక్కసును తాము అర్థం చేసుకుంటున్నామని, టికెట్లు రాని అభ్యర్థులను లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

మీ రాజకీయ అభద్రతాభావాన్ని మహిళ ప్రాతినిధ్యానికి ముడి పెట్టవద్దని హితవు పలికారు. పార్లమెంటు సీట్ల సంఖ్యను పెంచి మూడో వంతు స్థానాలను మహిళలకు రిజర్వ్ చేయాలని సీఎం కేసీఆర్ ప్రతిపాదించారని,దీనిపై yకేంద్ర ప్రభుత్వం ఏ చర్య తీసుకుందో చెప్పాలని కిషన్ రెడ్డిని ప్రశ్నించారు.

మహిళా హక్కులపై ఆయన ఆందోళన ఆశ్చర్యపరిచినప్పటికీ స్వాగతిస్తున్నానని, చివరికి బీజేపీ నుంచి ఎవరోఒకరు సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్‌ను ధ్రువీకరించారని పేర్కొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment