ప్రేమ జంట ఆత్మహత్య..

Get real time updates directly on you device, subscribe now.

తిరుపతి జిల్లాలో దారుణం.. ప్రేమ జంట ఆత్మహత్య..

హ్యూమన్ రైట్స్ టుడే/తిరుపతి జిల్లా/ఆగస్టు 20:
తిరుపతి జిల్లా భాకారాపేటలో దారుణం చోటు చేసుకుంది. చిన్నగొట్టిగల్లు మండలం భాకారాపేట ఘాట్ అడవులలో మైనర్ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది.

రామసముద్రం మండలం చిట్టెంవారిపల్లికి చెందిన కళ్యాణి (15), చౌడేపల్లె మండలం జోగిఇండ్లు (కొత్తిండ్లు)కు చెందిన యుగందర్ (17) కొంత కాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. పుంగనూరు ఎంసివి జూనియర్ కాలేజీలో ప్రేమికులు ఇంటర్ సెకండియర్ చదువుతున్నారు.

ప్రేమ వివాహానికి పెద్దలు అడ్డు చెబుతుండడంతో 18వ తేది రాత్రి ఇంటి నుంచి ప్రేమికులు పరారయ్యారు.

ప్రేమికులు పెళ్లి చేసుకొని అడవిలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తిరుపతి- పీలేరు రహదారిలోని భాకరాపేట ఫారెస్ట్ చెక్ పోస్ట్ సమీప అటవీ ప్రాంతంలో ఘటన జరిగింది. మృతదేహాలను పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు, ఇన్‌ఛార్జ్ ఎర్రవారిపాలెం ఎస్ఐ వెంకటేశ్వర్లు, సీఐ రాజశేఖర్ తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment