హ్యూమన్ రైట్స్ టుడే/జనగామ/ ఆగస్టు 19:
జనగామలో పల్లా గోబ్యాక్ అంటూ బీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలిపారు. జనగామ ఎమ్మెల్యే టికెట్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిగి రెడ్డికి కేటాయించాలని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా అధిష్టానం పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఇవ్వొద్దంటూ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు శనివారం నిరసన తెలిపారు.
ఈసందర్భంగా పల్లా గోబ్యాక్, పల్లా డౌన్ డౌన్ అంటూ నినాదాలు తెలిపారు. దీంతో పెద్ద ఎత్తున కార్యకర్తలు రావడంతో తీవ్ర ఉధృత పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు వారిని అడ్డుకోవడం జరిగింది.