వేలాదిమంది కార్మికుల అరెస్ట్
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/ఆగస్టు 18:
జీహెచ్ఎంసీలో అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న కార్మికులను సీఎం ఇచ్చిన హామీ మేరకు వెంటనే పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ శానిటేషన్ కార్మికులు శుక్రవారం ఉదయం నుంచి సమ్మె బాట పట్టారు.
కార్మికులు స్వీపింగ్ చెత్త తరలింపు విధులను బహిష్కరించడంతో శానిటేషన్ స్తంభించింది. ఎల్బీనగర్, చాదర్‌ఘాట్, లోయర్ ట్యాంక్ బండ్, యూసుఫ్ గూడా తదితర ప్రాంతాల్లోనే చెత్త ట్రాన్స్‌ఫర్ స్టేషన్ వద్ద వేలాదిమంది శానిటేషన్ కార్మికులను పోలీసులు అరెస్టు చేసి తరలించారు.
కార్మికులను ఎక్కడికక్కడ తరలించడంపై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు ఊదరి గోపాల్ మండిపడ్డారు. ఇందుకు నిరసనగా సాయంత్రం కల్లా సచివాలయాన్ని ముట్టడిస్తామని ఆయన తెలిపారు.