నేటితో ముగియనున్న మద్యం టెండర్ల గడువు
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్ /ఆగస్టు 18:
నేటితో మద్యం టెండర్ల గడువు ముగియనుంది. తెలంగాణలో మొత్తం 2,620 మద్యం షాపులు ఉన్నాయి.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 615 వైన్స్ షాపులు ఉన్నాయి. అయితే అధికారులు మొత్తం లక్ష అప్లికేషన్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. దరఖాస్తుల ద్వారానే సర్కారుకు రూ.2వేల కోట్లు సమకూరనున్నాయి. ఎన్నికల వేళ కావడంతో మద్యం షాపులకు భారీగా డిమాండ్ ఏర్పడింది.
తెలంగాణ వ్యాప్తంగా మద్యం షాపుల టెండర్లకు ఫుల్ రెస్పాన్స్ వస్తోంది. గురువారం వరకు 70 వేల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఒక్కో దరఖాస్తుకు రూ.2లక్షల ఫీజు వసూలు చేస్తున్నారు.