నేడు సిరిసిల్ల లో కేటీఆర్‌ పర్యటన

Get real time updates directly on you device, subscribe now.

హ్యూమన్ రైట్స్ టుడే/రాజన్న సిరిసిల్ల/ఆగస్టు18:
రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఆయనతో పాటు ఇద్దరు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, డిప్యూటీ స్పీకర్‌ పద్మారావుగౌడ్‌, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

మధ్యాహ్నం 2 గంటలకు సిరిసిల్ల పట్టణంలోని శాంతినగర్‌ బైపాస్‌రోడ్డులో ఏర్పాటు చేసిన పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు పద్మనాయక కల్యాణ మండపంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో జరిగే బహిరంగ సభలో ప్రజలనుద్ధేశించి ప్రసంగించనున్నారు.

సాయంత్రం 4 గంటలకు మానేరు బ్రిడ్జి వద్ద బోటు షికారును ప్రారంభిస్తారు. సాయంత్రం 5 గంటలకు బైపాస్‌రోడ్డులో కొత్తగా నిర్మించిన కే కన్వెన్షన్‌ సెంటర్‌ను ప్రారంభిస్తారు. అనంతరం జిల్లా ఏరియా దవాఖానకు చేరుకుని 40కేవీ రూప్‌టాప్‌ సోలార్‌ ప్లాంట్‌ను, 130 అదనపు బెడ్స్‌, క్యాన్సర్‌ బాధితుల కోసం కీమోథెరఫీ డేకేర్‌ సెంటర్‌ను ప్రారంభిస్తారు.

*సర్వాంగ సుందరంగా పాపన్న జంక్షన్‌*

సిరిసిల్ల పట్టణంలోని మొదటి బైపాస్‌రోడ్డులో నర్సింగ్‌ కళాశాల ఎదురుగా వేములవాడ, సిద్దిపేట ప్రధాన రహదారిపై సర్వాయి పాపన్న విగ్రహం ఏర్పాటు చేశారు.

దీని కోసం మున్సిపల్‌ శాఖ రూ.30 లక్షల నిధులు వెచ్చించించింది. పాపన్న పేరిట అద్భుతంగా రూపుదిద్దుకుంటున్న ఈ జంక్షన్‌కు సుమారు రూ.కోటిన్నర ఖర్చు చేయనున్నారు. విగ్రహం చుట్టూ గార్డెన్‌, పౌంటేన్‌లతో సందర్శకులను ఆకట్టుకునేలా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment