తిరుమలలో నేడు భక్తుల రద్దీ కొనసాగుతోంది..
హ్యూమన్ రైట్స్ టుడే/తిరుపతి /ఆగస్టు 18:
తిరుమలలో నేడు శుక్రవారం భక్తుల రద్దీ కొనసాగుతోంది.
నేడు స్వామివారి దర్శనం కోసం 11 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తుల శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.
ఇక గురువారం స్వామివారిని 64,695 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.6 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. శ్రీవారికి 24,473 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
పద్మావతి అమ్మవారి ఆలయంలో నేడు వరలక్ష్మి వర్రతం ఈ నెల 25న తిరుచానూరులో వైభవంగా జరగనుంది. భక్తులు నేరుగా కానీ వర్చువల్‌గా కానీ పాల్గొనే అవకాశం ఉంది.