సామాజిక మాధ్యమాలు, ఇతరత్రాచోట్ల రేషన్ కార్డు జారీ ప్రక్రియపై వస్తున్న సమాచారం తప్పు..
నూతన రేషన్ కార్డుల జారీపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు..
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/ఆగష్టు 17: గత కొన్ని రోజులుగా వివిధ సామాజిక మాధ్యమాలు, ఇతరత్రా ప్రచారాల్లో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ మొదలైంది అని వస్తున్న అసత్య ప్రచారాల్ని ఎవరు నమ్మొద్దని నేడు విడుదల చేసిన పత్రికా ప్రకటణలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. ప్రజల్ని అయోమయానికి గురిచేసేలా ఈ ప్రకటనలను ఎవరు ప్రచారంలోనికి తీసుకురావద్దని పేర్కొన్నారు.