డాక్టర్ నిర్లక్ష్యంతో మహిళ మృతి … శవంతో హాస్పటల్ వద్ద బంధువులు ధర్నా..
హ్యూమన్ రైట్స్ టుడే/భద్రాద్రి కొత్తగూడెం/ఆగస్టు 17: అశ్వారావుపేట నియోజకవర్గం, దమ్మపేట పట్టణంలో భవాని నర్సింగ్ హోమ్ వద్ద ఉద్రిక్తత. చోటు చేసుకుంది.
దమ్మపేట మండలం అల్లిపల్లి గ్రామానికి చెందిన పాండ్ల నందిని (26) అనే మహిళ మృతిచెందింది డాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే మృతి చెందింది అంటూ హాస్పటల్ వద్ద బంధువులు గురువారం ఆందోళన. చేపట్టారు. మహిళ మృత దేహంతో రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
ఈ హాస్పటల్ లో ఇటువంటి సంఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నా అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదంటూ మృతురాలి బంధువులు ఆరోపణ చేశారు.,
ఆదివాసీ బిడ్డకు న్యాయం జరిగేవరకు ఆందోళన విరమించేది లేదంటు బంధువులు , ఆదివాసీ సంఘాలు నేతలు అక్కడే బైఠాయించారు.