రానున్న అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ ఫస్ట్ లిస్టు కరారు..

Get real time updates directly on you device, subscribe now.

BRS పార్టీ గెలుపు గుర్రాల ఫస్ట్ లిస్ట్‌..

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్ /ఆగస్టు 17:
రానున్న అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ ఫస్ట్ లిస్టును ప్రకటించడానికి కసరత్తు దాదాపు కొలిక్కి వచ్చింది. తొలుత ఈ నెల 18న ప్రకటించాలనుకున్నప్పటికీ కొన్ని కారణాలతో ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

తొలి జాబితాలో లక్కీ నెంబర్ 6 కలిసొచ్చేలా 51 మంది పేర్లతో రూపొందించింది. ఈ స్థానాలన్నీ దాదాపుగా సిట్టింగ్‌లకే కట్టబెట్టింది. స్టేషన్ ఘన్‌పూర్ లాంటి ఒకటి రెండు స్థానాల్లో మాత్రమే మార్పులు జరిగాయి.

అన్ని పార్టీలకంటే ముందుగానే జాబితాను ప్రకటించాలనుకున్న బీఆర్ఎస్ వివాదాలు లేని స్థానాలను చేర్చింది. మిగిలిన స్థానాలపై కసరత్తు జరుపుతోంది.

త్వరలోనే సెకండ్ లిస్టు కూడా విడుదల కానున్నది. శ్రావణ మాసం కావడంతో ఫస్ట్ లిస్టును ఈ నెల 21 రిలీజ్ చేయాలని దాదాపుగా నిర్ణయం జరిగింది. తెలంగాణ భవన్ వేదికగా జరిగే ఈ కార్యక్రమంలో 51 మందితో తొలి లిస్టు ఉంటున్నది. పార్టీ వర్గాలు అందించిన వివరాల ప్రకారం ఆ స్థానాల్లో కొన్ని ఇవే…. :

*1. సిర్పూర్ – కోనేరు కోనప్ప*

*2. ఆదిలాబాద్ – జోగు రామన్న*

*3. నిర్మల్ – ఇంద్రకరణ్ రెడ్డి*

*4. సిరిసిల్ల – కేటీఆర్*

*5. హుస్నాబాద్ – సతీష్ బాబు*

*6. హుజూరాబాద్ – కౌశిక్ రెడ్డి*

*7. కరీంనగర్ – గంగుల కమలాకర్*

*8. కోరుట్ల – కల్వకుంట్ల విద్యాసాగర్*

*9. సిద్దిపేట – హరీశ్ రావు*

*10. దుబ్బాక – కొత్త ప్రభాకర్ రెడ్డి*

*11. నారాయణఖేడ్ – భూపాల్‌రెడ్డి*

*12. పటాన్ చెరు – మహీపాల్ రెడ్డి*

*13. నాగర్ కర్నూల్ – మర్రి జనార్ధన్ రెడ్డి*

*14. దేవరకద్ర – ఆల్ల వెంకటేశ్వరరెడ్డి*

*15. మహబూబ్ నగర్ – శ్రీనివాస గౌడ్*

*16. వనపర్తి – సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి*

*17. కొల్లాపూర్ – బీరం హర్షవర్ధన్ రెడ్డి*

*18. నారాయణపేట – రాజేందర్ రెడ్డి*

*19. జడ్చర్ల – లక్ష్మారెడ్డి*

*20. కూకట్‌పల్లి – మాధవరం కృష్ణారావు*

*21. శేరిలింగంపల్లి – అరికెపూడి గాంధీ*

*22. మహేశ్వరం – సబితా ఇంద్రారెడ్డి*

*23. మేడ్చల్ – మల్లారెడ్డి*

*24. మల్కాజిగిరి – మైనంపల్లి*

*25. తాండూరు – రోహిత్ రెడ్డి*

*26. వికారాబాద్ – మెతుకు ఆనంద్*

*27. సికింద్రాబాద్ – పద్మారావుగౌడ్*

*28. సనత్‌నగర్ – తలసాని శ్రీనివాస్ యాదవ్*

*29. మిర్యాలగూడ – భాస్కర రావు*

*30. తుంగతుర్తి – గ్యాదరి కిషోర్*

*31. హుజూర్‌నగర్ – సైదిరెడ్డి*

*32. నకిరేకల్ – చిరుమర్తి లింగయ్య*

*33. సూర్యాపేట – జగదీశ్వర్ రెడ్డి*

*34. దేవరకొండ – రవీంద్ర నాయక్*

*35. స్టేషన్ ఘన్‌పూర్ – కడియం శ్రీహరి*

*36. వరంగల్ వెస్ట్ – దాస్యం వినయభాస్కర్*

*37. భూపాలపల్లి – గండ్ర వెంకటరమణారెడ్డి*

*38. వర్ధన్నపేట – ఆరూరి రమేశ్*

*39. పాలకుర్తి – ఎర్రబెల్లి*

*40. పరకాల – చల్లా ధర్మారెడ్డి*

*41. నర్సంపేట – పెద్ది సుదర్శన్ రెడ్డి*

*42. ఖమ్మం – పువ్వాడ అజయ్*

*43. సత్తుపల్లి – సండ్ర వెంకటవీరయ్య*

*44. అశ్వారావుపేట – మెచ్చా నాగేశ్వరరావు*

*45. పినపాక – రేగా కాంతారావు*

*46. ఆర్మూర్ – జీవన్ రెడ్డి*

*47. బాన్సువాడ – పోచారం శ్రీనివాస్ రెడ్డి*

*48. బాల్కొండ – వేముల ప్రశాంత్ రెడ్డి*

*49. జుక్కల్ – హన్మంత్ షిండే*

*50. గజ్వేల్ – కేసీఆర్*

*51. ఎల్బీ నగర్ – సుధీర్ రెడ్డి*

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment