గిడ్డంగుల సంస్థ చైర్ పర్సన్ గా బాధ్యతలు స్వీకరించిన రజనీ
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్ /జులై 20:
ప్రముఖ ఉద్యమ గాయకుడు,దివంగత నేత సాయిచంద్ సతీమణి రజనీ గిడ్డంగుల సంస్థ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. గురువారం గిడ్డంగుల కార్యాలయంలోని ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించగా, మంత్రులు హరీశ్ రావు, నిరంజన్ రెడ్డి, నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత, రాష్ట్ర ప్రభుత్వ విప్ బాల్క సుమన్, చైర్మన్లు ఆంజనేయులు గౌడ్, ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎమ్మెల్యే భగత్‌తోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, భారత్ రాష్ట్ర సమితి నాయకులు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా చైర్మన్ రజనీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తమ కుటుంబానికి అండగా నిలిచారన్నారు. తనపై నమ్మకముంచి బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తమ కుటుంబం ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌తో పాటు భారత్ రాష్ట్ర సమితికి ఎప్పుడు మా కుటుంబం రుణపడి ఉంటుందన్నారు.