అన్ని పార్టీల ఎస్సీ సేల్ నాయకులు ఎవరికోసం పనిచేరుస్తున్నారు?

Get real time updates directly on you device, subscribe now.

అన్ని పార్టీల ఎస్సీ సేల్ నాయకులు ఎవరికోసం పనిచేరుస్తున్నారు :రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి వాగ్మారే అభిషేక్

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/16 జనవరి 2023: మల్లమరి మల్లికార్జున్ నిజాంబాద్ జిల్లాలోని కోటగిరి జిల్లా పరిషత్ ఉన్న పాఠశాలలో తెలుగు బోధించే ఒక దళిత టీచర్ పై (మనువాదులు, దాని అనుబంధ సంఘాలు, పార్టీలు) దాడి చేసినా, ఒక దళిత ఉద్యమ కారుని ఇంటిపై దాడి చేసిన మౌనంగా ఉన్నారా? సిగ్గు అనిపించడం లేదా? అంబెడ్కర్ పేరు మీద బతుకును వెళ్లదీస్తూ ఆయన ఆశయ నిర్మాణానికి శత్రువుల దాడికి మౌనం వహిస్తారా? మనువాది పార్టీ నాయకులు మాట్లాడకపోతే సరి మిగతా పార్టీల కాంగ్రెస్ లో బిజెపిలో టిఆర్ఎస్ లో తెలంగాణలో ఉన్నటువంటి జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు మరియు మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు నాయకుల మౌనం ఎందుకు? ఇంతకు మీరు ఏ పార్టీ ఎస్సీసెల్ అర్తం కావడం లేదు. మీ పార్టీల నాయకులు మత వాద పార్టీలను తిడుతా ఉంటే మీకు చలనం లేదా ఈ విషయంలో మీకు ప్రశ్నించే హక్కు, పోరాటం చేసే హక్కు లేదా?మరి అలా హక్కు లేని పదవులు ఎందుకు అడుక్కోవడానికా, అమ్ముడు పోవడానికా? టిఆర్ఎస్ లో మరియు కాంగ్రెస్లో బిజెపిలో ఉన్న (ఎస్సీ సెల్ అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యదర్శులు అమ్ముడు దీనికి ఇంకేదైన అర్తం ఉందా) దీనికోసమేనా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మనకోసం తన కుటుంబంతో సహా త్యాగం చేసింది. ఇప్పడు ఒక మల్ల మరి మల్లికార్జున్ నిజాంబాద్ జిల్లాలోని కోటగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు బోధించే టీచర్, ఉద్యమ కారులు, రేపు మీ నాయకులు లొంగిపోతే ఆ ఉద్యమకారుల స్థానంలో మీరు ఉండరా? ఆలోచించండి. మీకు జరిగితే మీ ప్రతిపక్ష పార్టీ సెల్ బాద్యులు అడుగుతారా? (అడిగే ధైర్యం రావాలి)మనకు వచ్చిన హక్కులు ఎవడి దయదక్షిణ్యానాల మీద రాలె డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ త్యాగం తో అనుభవిస్తున్నము. ఉద్యమాలను, దాని నాయకులను బ్రతికించుకునే బాధ్యత బాబాసాహెబ్ ద్వారా మనిషిగా బ్రతుకుతున్న ప్రతీ ఒక్కడి బాధ్యత. ఆలోచించండి సోదరులారా మనం పార్టీలతో సంభందం లేకుండా ఎవరికి ప్రమాదమొచ్చినా ఉమ్మడి ఆలోచన, పోరాటం, రాజకీయ ఐక్యత ఇవి ఖచ్చితంగా ఉంటే అందరం నాయకులమే, అధికారం మన కడప ముంగిట ఉంటుంది. శత్రువు నిరంతరం (ఎస్సీసెల్ తో సంభందం లేకుండా) నిన్ను చూస్తే ఉచ్చ పోసుకుంటాడు. నిన్ను నాయకుడిగా గుర్తిస్తారు. లేకపోతే నీవు మాన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మాటలో చెప్పాలంటే చెంచావే అని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఆత్వలే) తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి అన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment