ఒంగోలులో దారుణం.. గిరిజన యువకుడి నోట్లో మూత్రం పోసిన దుండగులు
మధ్య ప్రదేశ్ గిరిజన యువకుడి మీద మూత్రం పోసిన ఘటన మరువకముందే అదే తరహా ఘటన ఏపీలో జరిగింది. మోటా నవీన్, మన్నె రామాంజనేయులు అలియాస్ అంజి ఇద్దరూ దొంగతనాలు చేసే పాత నేరస్థులు. వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తగా నవీన్‌ను.. అంజి మద్యం తాగుదామని కిమ్స్ ఆసుపత్రి వెనకాల వైపు తీసుకువెళ్ళాడు.
మద్యం తాగిన తరువాత అంజితో పాటు మరో 9 మంది యువకులు నవీన్ మీద దాడి చేసి రక్తం వచ్చేలా కొట్టారు. నవీన్ నోట్లో మూత్రం పోసి తాగాలని, మర్మాంగాన్ని అతడి నోట్లో పెట్టే ప్రయత్నం చేశారు. ఈ దారుణం అంతా దుండగులు వీడియో తీశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో పెట్టడంతో దుమారం రేగింది.