43 మంది డీఎస్పీ స్థాయి అధికారుల బదిలీ.. ఆర్డర్స్ జారీ చేసిన డీజీపీ
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్ /జులై 16:
తెలంగాణలో 43 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ కార్యాలయం ఇవ్వాల శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో పలు డివిజన్‌లలో పనిచేస్తున్న ఎస్‌డీపీవో డీఎస్పీ లు ఉన్నారు. కొంతమందిని పోలీస్ హెడ్‌క్వార్టర్‌కు ఎటాచ్ చేస్తూ డీజీపీ అంజనీకుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఇక.. సార్వత్రిక ఎన్నికల ముందు పెద్ద ఎత్తున పోలీసు అధికారుల బదిలీలు జరగడం గమనార్హం.