ఆదిలాబాద్‌లో టమాటా లారీ బోల్తా, ఎగబడ్డ జనం.. పోలీసుల భారీ బందోబస్తు..
హ్యూమన్ రైట్స్ టుడే/ఆదిలాబాద్ /జులై 16:
దేశ వ్యాప్తంగా టమాటా రేటు ఆకాశాన్నంటుతున్న పరిస్థితుల్లో ఆదిలాబాద్ జిల్లాలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలో నేషనల్ హైవే 44 పై టమాటాలను తరలిస్తున్న లారీ ఆదివారం తెల్లవారుజామున బోల్తా పడింది. దీంతో రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయిన టమాటాలను తీసుకెళ్లేందుకు జనం ఎగబడ్డారు. అందినకాడికి టమాటాలను తీసుకెళ్లారు.
సమాచారం అందుకున్న రైతులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో లారీ చుట్టూ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బోల్తాపడిన లారీ కర్నాటకలోని కోలార్ నుంచి టమాటాల లోడ్‌తో ఢిల్లి వెళుతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ లారీలో 18 టన్నుల టమాటాలు ఉండగా.. మార్కెట్ రేట్ ప్రకారం దాదాపు 30 లక్షలు విలువ చేయనున్నట్టు సమాచారం అందుతోంది.