ఇంటి వద్దకే పోలీసు సేవలు..రాచకొండ సీపీ DS చౌహన్
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్ /రాచకొండ/జులై 15: నిరాధారణకు గురవుతున్న పిలల్లు, మహిళలు, బాధితులు ఎవరైనా పోలీసు స్టేషన్‌కు రాలేని స్థితిలో ఉంటే వారు 8712662111 రాచకొండ వాట్సాప్ కంట్రోల్ నెంబర్ నెంబర్‌కు ఫోన్ చేస్తే పోలీసు సేవలు తక్షణమే అందుతాయని కమిషనర్ డీఎస్ చౌహన్ భరోసా ఇచ్చారు. గత కొన్ని రోజులుగా కమిషనరేట్ పరిధిలో సీపీ చౌహన్ పలు పీఎస్‌లను సందర్శించినప్పుడు ఈ నెంబర్ ప్రజల్లోకి వెళ్లేలా కృషి చేస్తున్నారు. దీంతో పాటు పోలీసు స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదులపై సొంత నిర్ణయంతో కాకుండా చట్ట ప్రకారం చర్యలు తీసుకుని.. న్యాయం అందేలా అధికారులు పనిచేయాలని సీపీ సూచిస్తున్నారు.
ఈ విధంగా సీపీ చౌహన్ ప్రజల్లో పోలీస్ ప్రతిష్టను పెంచేలా తన మార్క్ వ్యూహలను అమలు చేస్తున్నారు. ఇప్పటికే నేరాల నియంత్రణలో తనదైన శైలిలో వ్యవహిరిస్తోన్న సీపీ.. వాహనాల నెంబర్ ప్లేట్‌లను ప్రతి వాహనదారుడు పెట్టుకునేలా చేస్తున్నారు. దీంతో నేరాలు జరిగినప్పుడు నేరగాళ్ళు ఉపయోగించిన వాహనాలను వెంటనే గుర్తించి క్రిమినల్స్‌ను కటాకటాలోకి నెడుతున్నారు. ప్రజలు కూడా శాంతి భద్రతలను వారి చేతుల్లోకి తీసుకోవద్దని.. పోలీసులు మీకు న్యాయం జరిగేలా అందుబాటులో ఉంటారనే సీపీ హామీ ఇస్తున్నారు.