హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్ /జులై 15:
హైదరాబాద్‌లో పలుచోట్ల మసాజ్ సెంటర్లపై టాస్క్ ఫోర్స్ పోలీసులు శనివారం ఉదయం మెరుపు దాడులు చేపట్టారు. పంజాగుట్ట, ఎస్ ఆర్ నగర్, బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ లోని పలు మసాజ్ సెంటర్లపై వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేపట్టారు. ఎలాంటి అనుమతులు లేకుండానే స్పా సెంటర్లు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 34 మందిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.