కవిత, కేటీఆర్‌పై సంచలన ఆరోపణలు

Get real time updates directly on you device, subscribe now.

గవర్నర్ తమిళసైకి సుఖేష్ చంద్రశేఖర్ లేఖ.. కవిత, కేటీఆర్‌పై సంచలన ఆరోపణలు


హ్యూమన్ రైట్స్ టుడే/న్యూఢిల్లీ/జులై 14:
రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సుఖేష్ చంద్రశేఖర్‌ మరో సారి తెలంగాణ గవర్నర్‌ తమిళసై సౌందర్ రాజన్‌కు లేఖ రాశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత మంత్రి కేటీఆర్‌పై సుఖేష్ చంద్రశేఖర్ మరో సంచలన లేఖ రాశారు. నా వద్ద ఉన్న ఆధారాలు ఇవ్వాలని కవిత, కేటీఆర్ తరపు సన్నిహితులు ఒత్తిడి తెస్తున్నారు. కవితకు వ్యతిరేకంగా ఈడీకి ఇచ్చిన స్టేట్‌మెంట్లలోని ఎవిడెన్స్ ఇవ్వమని అడుగుతున్నారు. ఆధారాలు ఇస్తే రూ.100 కోట్ల నగదు, శంషాబాద్ వద్ద భూమి, అసెంబ్లీ సీట్ ఇస్తామని ఆశపెడుతున్నారు. దాదాపు 200 కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు నా వద్ద ఉన్నాయి. కవితకు నాకు మధ్య జరిగిన వాట్సాప్ చాట్ అంతా రికార్డింగ్ ఉంది. ఈ ఆధారాలని ఇప్పటికే ఈడీకి 65 -బి సర్టిఫికెట్ రూపంలో ఇచ్చేశా. కవిత నుంచి రూ.15 కోట్ల నగదు తీసుకొని అరవింద్ కేజ్రీవాల్ తరపు వారికి అందజేశా. ఈ అంశాలపై సీబీఐ దర్యాప్తు చేయాలని కోరుతున్నా’’ అంటూ గవర్నర్‌ తమిళసైకు సుఖేష్ చంద్రశేఖర్ లేఖ రాశారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment