అడిషనల్ కలెక్టర్ గా సీహెచ్. ప్రియాంక
హ్యూమన్ రైట్స్ టుడే/పెద్దపల్లి జిల్లా /జులై 14:
ప్రభుత్వం రాష్ట్రంలో ఐఏఎస్ లను భారీగా బదిలీ చేసింది. పెద్దపల్లి కలెక్టర్ గా సిద్దిపేట జిల్లా లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్ గా పని చేస్తున్న ముజామిల్ ఖాన్ ను నియమించినట్లు స్టేట్ చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. ముజామిల్ ఖాన్ 2017 యూపీఎస్సీ ఎగ్జామ్ లో 22 ర్యాంక్ సాధించి సిద్దిపేట అడిషనల్ కలెక్టర్ గా విధులు నిర్వహించారు. అతను పోలీస్ డిపార్ట్ మెంట్ లో డీజీగా పని చేసిన ఏ.కే ఖాన్ కుమారుడు కావడం విశేషం. పెద్దపల్లిలో పని చేస్తున్న సంగీత సత్యనారాయణను టీ.ఎస్ ఫుడ్స్ ఎండీగా బదిలీ చేశారు. జడ్పీ సీఈవో గా పని చేస్తున్న సీహెచ్. ప్రియాంకను లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్ గా బదిలీ చేశారు. లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్ గా పెద్దపల్లిలో పనిచేస్తున్న కుమార్ దీపక్ ను నాగర్ కర్నూల్ అడిషనల్ కలెక్టర్ గా బదిలీ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అదేవిధంగా కరీంనగర్ కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ గా పని చేస్తున్న శ్యాం ప్రసాద్ లాల్ ని పెద్దపల్లి అడిషనల్ కలెక్టర్( రెవెన్యూ) కి బదిలీ చేశారు. అక్కడ పని చేస్తున్న వి.లక్ష్మినారాయణ ను రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రెటరీ కి రిపోర్టు చేయాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.