హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/జులై 15:
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో కాల్పులు కలకలం సృష్టించాయి. శామీర్ పేట్ లోని సెలబ్రిటీ క్లబ్ లో ఓ యువకుడు కాల్పులకు తెగబడ్డాడు. సిద్దార్ధ్ దాస్ అనే వ్యక్తిపై మరో యువకుడు ఈ కాల్పులు చేసినట్టు తెలుస్తుంది. దీనితో బాధితుడు శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. అయితే కాల్పులు జరిపిన యువకుడు సిద్దార్ధ్ దాస్ కు తెలిసిన వ్యక్తా అనేది తెలియాల్సి ఉంది. నిన్న రాత్రి సెల బ్రిటీ క్లబ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.
అయితే ఈ కాల్పులకు సంబంధించి గల కారణాలు తెలియాల్సి ఉంది. పాత కక్షలతోనే ఈ కాల్పులు జరిగాయా? లేక మరే ఇతర కారణాలున్నాయనేది తేలాల్సి ఉంది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు కాల్పులు జరిపిన యువకుడిని గుర్తించే పనిలో ఉన్నారు. ఘటనాస్థలంలో ఉన్న సీసీ కెమెరాల ద్వారా నిందితుడి ఆచూకీని చూస్తున్నారు.