*కుంటాల జలపాతం వద్ద యువతి ఆత్మహత్యాయత్నం సినిమా తరహాలో కాపాడిన పోలీసులు*
హ్యూమన్ రైట్స్ టుడే/ఆదిలాబాద్ జిల్లా /జులై 15:
యూట్యూబర్ యువతి ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. ఆదిలాబాద్ జిల్లా కుంటాల జలపాతంలో శుక్రవారం సాయంత్రం దూకి చనిపోయేందుకు సిద్ధమైన యూట్యూబర్ ను పోలీసులు, ఫారెస్ట్ సిబ్బంది చాకచక్యంగా కాపాడారు. అయితే ఆత్మహత్యాయత్నానికి మానసిక స్థితే కారణంగా తెలిసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ మధురానగర్ కాలనీకి చెందిన మైథిలి ఇంట్లో వారికి చెప్పకుండా శుక్రవారం ఉదయం కుంటాల జలపాతానికి బయలు దేరింది.
అయితే వెంటనే తండ్రి ఎల్లారెడ్డి మధురానగర్ పీఎస్ లో కంప్లైంట్ చేవారు. మధురానగర్ పోలీసులు నేరడిగొండ పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే అలర్ట్ అయిన పోలీసులు విషయాన్ని గ్రామ సర్పంచ్ అశోక్ కు తెలిపారు. సర్పంచ్, ఫారెస్ట్ అధికారులు మెట్లు దిగుతున్న యువతిని పట్టుకున్నారు. అక్కడినుంచి పీఎస్‌కు తరలించారు. నేరడిగొండకు చేరుకున్న తండ్రికి కూతురిని అప్పగించారు. యాక్టివ్ గా ఉండే మైథిలి ఎందుకు సూసైడ్ అటెంప్ట్ చేసిందనే కోణంలో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.