*ఉగ్రవాదులకు పదేళ్లు జైలు శిక్ష*
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్ /జులై 13:
హైదరాబాద్ లో తీవ్ర సంచలనం సృష్టించిన లుంబినీ పార్కు, గోకుల్ చాట్ పేలుళ్ల కేసుల్లో నిందితులకు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది. ఇండియన్ ముజాహిద్దున్‌కు చెందిన నలుగురు ఉగ్రవాదులకు శిక్ష ఖరారు అయింది. నలుగురు టెర్రరిస్టులకు కోర్టు పదేళ్లు జైలు శిక్ష విధించింది. హైదరాబాద్‌కు చెందిన ఒబేదుర్ రహ్మన్‌తో పాటు, ధనీష్ అన్సారీ, అఫ్తాబ్ అలాం, ఇమ్రాన్ ఖాన్‌లకు కోర్టు శిక్ష విధించింది. వారణాసి, ముంబై, ఫైజాబాద్, లక్నో హైదరాబాద్‌లో జంట పేలుళ్లు, జైపూర్, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై సీరియల్ బ్లాస్ట్‌ల్లో నిందితుల ప్రమేయం ఉన్నట్లు తెలిసింది. హైదరాబాద్, ఢిల్లీలో భారీ పేలుళ్లకు వీరు కుట్ర పన్నినట్లు సమాచారం.