వికారాబాద్ జిల్లా కోట్ పల్లి ప్రాజెక్టులో ఈతకు వెళ్లి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు యువకులు మృతి..!
హ్యూమన్ రైట్స్ టుడే/వికారాబాద్ /16 జనవరి 2023: వికారాబాద్ జిల్లా కోట్ పల్లి ప్రాజెక్టులో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు యువకులు మృతి చెందారు. సంక్రాంతి పండుగను సరదాగా గడుపుదామని ఈతకు వెళ్లి మృత్యువు ఒడిలోకి చేరుకున్నారు. పండుగ వేళ వీరి కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మృతులు వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మన్నెగూడ గ్రామానికి చెందిన వారిగా గుర్తింపు.. మృతదేహాలను వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జగదీష్, లోకేష్, రాజేష్, వెంకటేష్ చనిపోయినట్లుగా గుర్తించారు.