హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/జులై 13:
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలిత కుమారి బదిలీ అయ్యారు. ఆమెను కర్ణాటక హైకోర్టుకు బదిలీ చేశారు. దీనికి సంబంధించిన సంబంధించి.. సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసులను కేంద్ర ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం బదిలీ ఉత్తర్వులను జారీ చేసింది.
జస్టిస్ కన్నెగంటి లలిత కుమారితో పాటు మరో ఇద్దరు వేర్వేరు రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తుల బదిలీలను కూడా కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. గతంలో ఆమె ఏపీ హైకోర్టులో పని చేశారు. అనంతరం తెలంగాణ హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఇక తాజాగా కర్ణాటకకు బదిలీ చేస్తూ కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఉత్తర్వులు జారీ చేశారు.