గాయకుడు సాయిచంద్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులు..
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/జూలై 09:
ప్రముఖ గాయకుడు సాయిచంద్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులు అర్పించారు. హైదరాబాద్ హస్తినాపురంలోని జీఎస్‌ఆర్ కన్వెన్షన్ హాల్‌లో ఆదివారం జరుగుతున్న సాయిచంద్ దశ దిన కర్మకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. సాయిచంద్ చిత్రపటానికి పూలమాల వేసి, పూలు చల్లి పుష్పాంజలి ఘటించారు.
సాయిచంద్ కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీనివాస్ గౌడ్, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, నిరంజన్ రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.