కుమార్తె మృతదేహం వద్ద రోదిస్తున్న తల్లి లక్ష్మీకుమారి
హ్యూమన్ రైట్స్ టుడే/రాజుపాలెం/జూలై09:
శనివారం ఉదయం భార్య, భర్త ఇంట్లోనే ఉండగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈక్రమంలో ఆమె మనస్తాపానికి గురై వేరే గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుంది. వెంటనే ఎస్సై నారాయణ తలుపులు పగులగొట్టి ఆమెను సిబ్బంది సహాయంతో పిడుగురాళ్లలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న సత్తెనపల్లి డీఎస్పీ ఆదినారాయణ, గ్రామీణ సీఐ కోటేశ్వరరావు రాజుపాలెం చేరుకుని సంఘటన జరిగిన ఇంటిని పరిశీలించారు. సాయంత్రానికి మృతురాలి బంధువులు ఆసుపత్రికి చేరుకుని రోదించగా పోలీసు అధికారులు వారిని సముదాయించారు. నారాయణది తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం గుణపాడు, లక్ష్మీగీత స్వగ్రామం రేణిగుంట. వీరికి మూడేళ్ల నేత్ర, ఏడాది వయస్సున్న చైత్ర ఉన్నారు.
బిడ్డ పుట్టినరోజు జరుపుకొనేందుకు..
తమ కుమార్తె చైత్ర మొదటి పుట్టిన రోజు వేడుకలను స్వగ్రామంలో సోమవారం ఘనంగా జరుపుకోవాలని భార్యభర్తలు నిర్ణయించుకున్నారు. అందుకు సెలవు కావాలని ఎస్సై నారాయణ ఉన్నతాధికారుల అనుమతి కోరారు. వేడుకకు సంబంధించిన దుస్తుల కొనుగోలుకు శనివారం గుంటూరుకు వెళ్లేందుకు బయల్దేరుతుండగా.. ఏం జరిగిందో తెలియదు. పాలుతాగే పసిపాపని వదిలి ఆమె ఆత్మహత్య చేసుకుంది.