అనుమానస్పద స్థితిలో బాలిక మృతి
హ్యూమన్ రైట్స్ టుడే/జగిత్యాల జిల్లా/జూలై 09: జగిత్యాల పట్టణంలోని చిలుక వాడకు చెందిన సుద్దాల సంజన (11) ఆదివారం ఇంట్లో అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. బాలిక తల్లి ఇంట్లో నుంచి బయటికి వెళ్లి తిరిగి వచ్చే సరికి మంచంపై పడి ఉంది. బాలిక తల్లి రాధ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బాలిక మెడపై తాడుతో ఉరి వేసుకున్నట్లుగా గుర్తులు ఉన్నాయి. కొంతకాలంగా ఫిట్స్ వ్యాధితో బాధపడుతున్న బాలిక ఆత్మహత్యకు పాల్పడిందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. బాలిక తల్లి రాధ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే, ఘటనకు సంబందించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.