సికింద్రాబాద్ మహంకాళి అమ్మ వారిని దర్శించుకున్న సీఎం కేసీఆర్..
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్ /జులై 09:
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో ఘనంగా బోనాల పండుగ ప్రారంభమైంది. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయానికి సతీసమెతంగా సీఎం కేసీఆర్ బంగారు బోనంతో వచ్చారు. తలపై పట్టు వస్త్రాలతో అమ్మవారి ఆలయానికి చేరుకున్నా కేసీఆర్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కేసీఆర్ కవిత ఆలయం లోపల అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆలయ సిబ్బంది పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కుటుంబ సమేతంగా సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారికి లక్షలాది మంది మహిళలు బోనాలు సమర్పిస్తున్నారు.