మావోయిస్టు లేక కలకలం…

Get real time updates directly on you device, subscribe now.

భద్రాద్రి వైద్యులకు మవోయిస్టుల స్ట్రాంగ్ వార్నింగ్…

హ్యూమన్ రైట్స్ టుడే/బద్రద్రికొత్తగుడెం/16 జనవరి 2023: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్యులకు మవోయిస్టులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వైద్యులు తమ పద్ధతి మార్చుకోకపోతే ప్రజా కోర్టులో శిక్ష తప్పదంటూ భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ కార్యదర్శి పేరుతో మావోయిస్టులు బహిరంగ లేఖ విడుదల చేశారు. భద్రాచలం ఆస్పత్రులు మెడికల్ మాఫియాగా మారాయని.. రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ఆసుపత్రుల్లో వైద్యులు డబ్బులు పోగు చేసుకుంటున్నారని ఆరోపించారు. పద్ధతి మార్చుకోకపోతే మూల్యం చెల్లించక తప్పదని లేఖలో హెచ్చరించారు. మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన భద్రాచలం ఇప్పుడు మెడికల్ మాఫియాకు కాసులు కురిపిస్తోందనీ.. పూర్తి ఏజెన్సీ ప్రాంతం కావడంతో గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని సంపాదనే ధ్యేయంగా ఆసుపత్రులు పనిచేస్తున్నాయని ఆరోపించారు. ప్రజల ఆరోగ్యాన్ని బూచిగా చూపి వారిని భయభ్రాంతులకు గురిచేసి రోగుల రక్తం పిండుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఛత్తీస్‌గడ్, ఒడిశా, ఆంధ్ర ప్రాంత గిరిజనులు, గిరిజనేతరులతో పాటు స్థానిక తెలంగాణ ప్రాంత ప్రజలను వైద్యం పేరుతో రోజుల తరబడి ఆసుపత్రుల్లో ఉంచి అవసరం లేకున్నా రకరకాల పరీక్షలు చేస్తూ ల్యాబ్‌లు, ఆసుపత్రులు, వైద్యులు.. ప్రజలను డబ్బుల కోసం హింసిస్తున్నారని లేఖలో రాసుకొచ్చారు.

ప్రజల ప్రాణాలు ఇప్పడు ఆసుపత్రులకు డబ్బులు కురిపించే అవకాశాలుగా మారాయని, ప్రజల నమ్మకానికి తూట్లు పొడుస్తూ కొందరు వైద్యులు రాక్షసుల్లా తయారై.. రోగుల రక్తాన్ని జలగల్లా పీల్చుతున్నారనీ లేఖలో రాసుకొచ్చారు. ఆరోగ్య సమస్యలను అలుసుగా చేసుకుని.. మనిషిలో రకరకాల పరీక్షల పేర్లతో భయాన్ని సృష్టిస్తూ ఆసుపత్రి గల్లలను కొల్లలుగా నింపుకుంటున్నారనీ, ప్రైవేటు ఆసుపత్రి మొదలుకొని ప్రభుత్వ ఆసుపత్రి వరకు కాసుల కక్కుర్తి మరిగిన వైద్యులు జనాలను పీడించుకుతింటున్నారన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment