కేంద్రాల నుంచి పక్కదారి పట్టకుండా చర్యలు..
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్ /జులై 09:
అంగన్ వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులు, గర్భిణులు, బాలింతలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో అంగన్ వాడీ కేంద్రం ద్వారా ప్రభుత్వం ప్రతి నెలా కోడిగుడ్లు ఇతర పోష్టికాహారం పంపిణీ చేస్తుంది. ఈ క్రమంలో అంగన్ వాడీ కేంద్రాలకు అందించే కోడిగుడ్లు పక్కదారి పడుతున్నాయని ఆరోపణలు తరచూ వస్తున్నాయి. అదేవిధంగా అలాగే కుళ్లిన మరీ చిన్న సైజు కలిగిన గుడ్లు సరఫరా చేస్తుండటంతో అవి చెత్త బుట్ట ల్లోకి వెళ్తున్నాయి.
ఈ నేపథ్యంలో సమగ్ర శిశు సంక్షేమ శాఖ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అక్రమాలకు నియంత్రించేందుకు ప్రభుత్వం కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఇకపై ప్రతి కోడిగుడ్డుపై అంగన్ వాడీ గుడ్డు అని ముద్రించి కేంద్రాలకు పంపిణీ చేయనున్నట్లు సూపర్ వైజర్ తెలిపారు. అంగన్ వాడీ టీచర్లు బరువు తక్కువ ముద్ర లేని గుడ్లను తీసుకోవద్దని సూచించారు.