నందిగామలో సంచలనం సృష్టించిన జంట హత్యలు..!

Get real time updates directly on you device, subscribe now.

*బంగారం నగదు కోసమే “మర్డర్”*

*ఆ ఇద్దరినీ హత మార్చింది బీహారీ జంటే..!*

*నందిగామలో సంచలనం సృష్టించిన జంట హత్యలు..!

*చిన్నారి, వృద్ధురాలిని హత మార్చిన బీహారీ జంట*

*షాద్ నగర్ నియోజక వర్గం నందిగామ మండలంలో ఘటన*

*కొన్ని గంటల వ్యవధిలోనే హంతకులను పట్టుకున్న నందిగామ పోలీసులు*

*హంతకుల వేటలో నందిగామ సీఐ రామయ్య నేతృత్వంలో నాలుగు పోలీసు బృందాలు*

*పోలీసుల అదుపులో హంతకులు..!*

హ్యూమన్ రైట్స్ టుడే/నందిగామ: అభం శుభం తెలియని 9 ఏళ్ల బాలిక, 60 ఏళ్ల వృద్ధురాలు దారుణ హత్యకు గురయ్యారు. ఈ సంఘటన షాద్‌నగర్‌ నియోజకవర్గ పరిధిలోని నందిగామలో శుక్రవారం రాత్రి జరిగింది. అయితే, వీరిని ఎవరు, ఎందుకు హత్య చేశారనే కోణంలో స్ధానిక సీఐ రామయ్య నేతృత్వంలో పోలీసులు క్లూస్‌ టీంతో సహా దర్యాప్తు చేశారు. కేవలం హత్య జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే పోలీసులు చాకచక్యంగా వలపన్ని హంతకులను అరెస్టు చేసినట్టు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం చిన్నారిని, వృద్ధురాలిని హత్య చేసిన హంతకులు పోలీసుల అదుపులో ఉన్నారు. నందిగామ సిఐ రామయ్య సంఘటన స్థలాన్ని సందర్శించి శంషాబాద్ డిసిపి నారాయణరెడ్డికి సమాచారం అందించగా వారు రంగంలోకి దిగారు. రాత్రికి రాత్రి నాలుగు పోలీసు బృందాలు హంతకుల కోసం జల్లెడ పట్టాయి. ఈ నేపథ్యంలో హత్య జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే బీహార్ కు చెందిన ఇద్దరు భార్యాభర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం వారిని పోలీసు కస్టడీలో ఉంచినట్టు తెలుస్తోంది.

*అసలేం జరిగింది..?*

స్థానికుల కథనం ప్రకారం నందిగామ మండల కేంద్రానికి చెందిన కృష్ణ, శశికళ దంపతులు కూలి పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారి ఇంటి పక్కనే వారి బంధువు పార్వతమ్మ(60) అంగన్‌వాడీ ఆయాగా పనిచేసేకుంటూ ఒంటరిగా ఉంటోంది. దీంతో కృష్ణ, శశికళల కూతురు భానుప్రియ(9) నాలుగేళ్లుగా పార్వతమ్మకు తోడుగా ఆమె వద్దే ఉంటోంది. ఈ క్రమంలో రెండు రోజులుగా భానుప్రియ కనిపించడం లేదని ఆ చిన్నారి తల్లిదండ్రులు శుక్రవారం రాత్రి పార్వతమ్మ ఇంటికి వెళ్లి చూశారు. అప్పటికే భానుప్రియ రక్తపు మడుగులో పడి ఉంది. ఆ బాలికను మెడపై గుర్తు తెలియని వ్యక్తులు కోసి హత్య చేసినట్టు గుర్తించారు. అంతేకాకుండా పార్వతమ్మపై కూడా దాడి చేసినట్లు గుర్తించారు. వారు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. కొన ఊపిరితో ఉన్న పార్వతమ్మను షాద్‌నగర్‌ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. రెండు రోజుల క్రితం బిహార్‌కు చెందిన ఓ వ్యక్తి పార్వతమ్మ ఇంట్లో అద్దెకు దిగాడు. ఈ హత్య తర్వాత అతను కనిపించడం లేదని స్థానికులు తెలిపారు. జంట హత్యలపై నందిగామ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని డీసీపీ నారాయణరెడ్డి పరిశీలించారు.

*బంగారం నగదు కోసమే*

ఇంట్లో అద్దెకు దిగిన బిహారీలు ఆలుమగల జంట ఇంత ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న పార్వతమ్మ, చిన్నారి భానుప్రియలను హతమార్చి ఆమె వద్ద ఉన్న బంగారం నగదు దోచుకెళ్లడానికి మర్డర్ ప్లాన్ చేశారు. ఇంట్లో వారిని లక్ష్యంగా చేసుకొని దారుణాతి దారుణంగా హింసించి చంపారు. అయితే కొన ఊపిరితో ఉన్న పార్వతమ్మ మార్గమధ్యలో మరణించింది. స్థానికులు నందిగామ సిఐ రామయ్యకు ఈ విషయం చెప్పగా రంగంలోకి దిగిన రామయ్య తదితర పోలీసు బృందాలు హంతకులను వెంటాడి వేటాడి పట్టుకున్నారు. పోలీసులు చాకచక్యంగా వలపన్ని పట్టుకోవడంతో వారు దొరికారు. లేకపోతే వారు వారి బీహార్ రాష్ట్రానికి గుట్టుగా వెళ్లిపోయేవారు. కేవలం గంటల వ్యవధిలోనే మర్డర్ కేసు చేదించిన నందిగామ సిఐ రామయ్య తదితర పోలీసు బృందంపై స్థానికులు అభినందనలు వ్యక్తం చేస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment