శీర్షిక:ప్రకృతి
ఈ పపంచంలో ప్రతి జీవిపై పెత్తనం చెలాయిస్తూ
స్వార్థంతో మన స్వాలంబన కోసం…
వనసంపదను సంహరిస్తూ
కాలుష్యాన్నీ పెంచుతూ
జీవజాతులను నాశనం చేస్తున్నాము మనం..!
దాహంతో బిక్కుమంటున్న మూగజీవుల అరణ్యరోదన
ప్రజల ఆక్రందన పెడచెవిన పెడుతున్నాము మనం..!
స్వార్థపూరితమైన ఆలోచనలతో..
సెల్ టవర్స్ పుణ్యమా అని
కోయిల మధురగానం,
కువకువల సందడి
నాశనం చేస్తున్నాము మనం..!
టెక్నాలజీ పేరుతో యాంత్రిక వ్యవసాయం చేస్తూ
ఆవుల గంజరం ఉనికేలేకుండా చేస్తున్నాము మనం..!
అన్నింటిని నాశనం చేస్తున్నాము మనం కాని…
ఎదో ఒక రోజు ఉపద్రవం ముంచుకొచ్చి ప్రకృతి చెతిలో
మమ అనకముందే….
ఎన్నో జీవుల బ్రతుకుదెరువుకు కారణమయినా..
పకృతిని కాపాడుకొని భావితరాలకు వారసత్వంగా అందించుకుందాం.
– శ్రీమతి మంజుల పత్తిపాటి ( కవయిత్రి)
చరవాణి 9347042218