కళ్లలో పొడిచి, నరాలు లాగి..

Get real time updates directly on you device, subscribe now.

*కళ్లలో పొడిచి, నరాలు లాగి.. నర్సింగ్‌ విద్యార్థిని దారుణ హత్య*


హ్యూమన్ రైట్స్ టుడే/పరిగి /జూన్‌ 12:
వికారాబాద్‌ జిల్లాలో ఓ నర్సింగ్‌ విద్యార్థినిని గుర్తుతెలియని వ్యక్తులు అత్యంత దారుణంగా హత్య చేయడం స్థానికంగా కలకలం రేపింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పరిగి మండలం కాళ్లాపూర్‌ గ్రామానికి చెందిన జట్టు శిరీష(19) వికారాబాద్‌లోని ఓ నర్సింగ్‌ కళాశాలలో విద్యను అభ్యసిస్తోంది. మూడు రోజుల క్రితం శిరీష వికారాబాద్‌ నుంచి ఇంటికి వచ్చింది. తల్లి యాదమ్మకు అనారోగ్యంగా ఉండటంతో శిరీష అన్న శ్రీకాంత్‌ ఆమెను శనివారం ఆస్పత్రికి తీసుకెళ్లాడు. తండ్రి జంగయ్య, శిరీష ఇంట్లో ఉన్నారు. అదే రోజు రాత్రి 10 గంటల తర్వాత ఇంటి నుంచి బయటికి వెళ్లిన శిరీష, తిరిగి రాలేదు. ఆదివారం మధ్యాహ్నం కాళ్లాపూర్‌ శివారుల్లోని మైసమ్మ ఆలయ సమీపంలో ఓ నీటి కుంటలో ఆమె మృతదేహాన్ని గ్రామస్థులు గుర్తించారు. దుండుగులు మృతురాలి కళ్లలో, మెడపైనా కత్తితో పొడిచి అత్యంత పాశవికంగా హత్య చేశారు. కాళ్లు, చేతుల్లో నరాలు బయటికి వచ్చేలా కత్తితో హింసించిన ఆనవాళ్లు ఉన్నాయి. పోలీసులు, కేసు నమోదు చేశారు.

తెలిసిన వారి పనే..?

శిరీష హత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కళాశాల నుంచి వచ్చిన తర్వాత శిరీష మళ్లీ తిరిగి వెనక్కి వెళ్లలేదు. ఇంటి దగ్గరే ఉంటోంది. ఆమెను తల్లిదండ్రులు కాలేజీ మాన్పించారా..? దీని వెనుక ఏమైనా ప్రేమ వ్యవహారం ఉందా..? అంత రాత్రి వేళ ఆమె బయటికి ఎందుకు వెళ్లింది..? తన వెంట తండ్రి ఎందుకు వెళ్లలేదు..? ఇలాంటి పలు ప్రశ్నలకు సమాధానాలు లభించాల్సి ఉంది. బాగా తెలిసిన మిత్రులు లేదా బంధువులే ఈ ఘాతుకాన్ని తలపెట్టి ఉంటారన్న అనుమానాలను కూడా గ్రామస్థులు వ్యక్తం చేస్తున్నారు. కాగా.. శిరీష అక్క భర్త అనిల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇంట్లో పని చేయనందుకు శిరీషపై ఆమె చేయిచేసుకోవడంతో ఆమె ఆగ్రహంగా ఇల్లు విడిచి వెళ్లిపోయిందన్న ప్రచారం కూడా ఊళ్లో నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె బావతో పాటు తండ్రి, సోదరుడిని కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment