*నేటి నుంచి మోగనున్న బడిగంట*
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్ /జూన్ 12:
తెలంగాణలో స్కూల్స్ ప్రారంభంపై విద్యా శాఖ ప్రకటన చేసింది.ఈనెల12 న, సోమవారం నుండి స్కూల్స్ తిరిగి ప్రారంభం కానున్నట్లు విద్యాశాఖ స్పష్టతను ఇచ్చింది. దీంతో ఈ రోజు పాఠశాలలు తెరుచుకోనున్నాయి. విద్యార్థులు పాఠశాలకు హాజరు కావాలని విద్యా శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలో పాఠశాలలకు సెలవులు పొడిగిస్తారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో విద్యాశాఖ స్పష్టతను ఇచ్చింది.