*రైతులు ఇబ్బంది పడకుండా చూడాలి..
హ్యూమన్ రైట్స్ టుడే/పెద్దపల్లి జిల్లా/జూన్ 11:
మంథని మున్సిపాలిటీ పరిధిలోని బన్నెచెరువు నుంచి ఖానాపూర్ వరకు చేపట్టిన బీటీ రోడ్డు పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధు సూచించారు. ఈ మేరకు ఆదివారం రహదారి నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ అనేక ఏండ్లుగా ఆయకట్టు రైతులు ఇబ్బందులు పడుతున్న క్రమంలో బన్నె చెరువు నుంచి ఖానాపూర్ సమీపం వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరీ చేయించి పనులు ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. దశాబ్దాలు గడిచిన గత పాలకులు ఏనాడు రైతుల కష్టాలు పట్టించుకోలేదని, వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, కూలీలు బురద రోడ్డులోఅనేక కష్టాలు ఎదుర్కొన్నారని ఆయన గుర్తు చేశారు. రైతుల కష్టాలు తీర్చాలనే ఆలోచనతోనే రహదారి నిర్మాణం చేపట్టామని ఆయన అన్నారు. బీటీ రోడ్డుపనులను త్వరగా పూర్తి చేసి వర్షాకాల సీజన్‌లో పంట పొలాలకు వెళ్లే రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలని ఆయన సూచించారు.