హ్యూమన్ రైట్స్ టుడే/గుంటూరు జిల్లా /జూన్ 11:
నెలకు పైగా వేసవి సెలవుల అనంతరం మిర్చియార్డు గుంటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ తలుపులు తెరుచుకోనున్నాయి. సోమవారం ఈ నెల 12 నుంచి మిర్చి క్రయవిక్రయాలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు తీసుకొచ్చే మిర్చి లోడు లారీలు, ట్రాక్టర్లు, ఆటోలను ఆదివారం రాత్రి నుంచే యార్డు లోపలికి అనుమతించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. సెలవులకు ముందు వివిధ రకాల మిర్చి నాణ్యతని బట్టి క్వింటాల్‌కు రూ.22 వేలకు పైగా ధర లభించింది. నెల పాటు సెలవులు కారణంగా డిమాండ్ పెరిగి ధర కూడా మరింత పెరిగే అవకాశం ఉందని రైతులు అంచనా వేస్తున్నారు. గుంటూరు మిర్చియార్డు పరిసర ప్రాంతాల్లో ఉన్న కోల్డ్‌స్టోరేజ్‌లలో దాదాపుగా 58 లక్షల మిర్చి టిక్కీల వరకు నిల్వ ఉంటాయని మార్కెటింగ్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి.