మహబూబాబాద్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం

Get real time updates directly on you device, subscribe now.

*పదిహేను వేల క్వింటాళ్ల ధాన్యం బుగ్గిపాలు
హ్యూమన్ రైట్స్ టుడే/మహబూబాబాద్‌/జూన్11:
మహబూబాబాద్ జిల్లాలో మహదేవ్ రైస్ మిల్ ఇండస్ట్రీస్ మిల్లులో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టమూ జరకపోయినా భారీ స్థాయిలో ఆస్తి నష్ట జరిగింది.. ఈ ప్రమాదం వల్ల రూ. 2 కోట్ల మేర ఆస్తి నష్టం, అలాగే 15 వేల క్వింటాళ్ల ధాన్యం, 5 వేల క్వింటాళ్ల బియ్యంజరిగినట్లు పోలీసుల వెల్లడించారు.

వివరాల్లోకి వెళితే మహబూబాబాద్ లోని జిల్లాలోని కేసముద్రం మండలం భూక్యారాంతండా గ్రామంలోని మహాదేవ ఇండస్ట్రీస్‌ ఆధ్వర్యంలో ఉన్న ఓ రైస్ మిల్లు కొనసాగుతోంది. అందులో శనివారం తెల్లవారుజామున ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. ఇక్కడ పని చేసే సిబ్బంది ఎప్పటిలాగే శుక్రవారం సాయంత్రం వరకు ఉండి, తరువాత ఇంటికి వెళ్లిపోయారు. ఆ తర్వాత శనివారం ఉదయం 4 గంటలకు కూలీలు అక్కడకు చేరుకున్నారు. అయితే ఐదు గంటల సమయంలో లోపలి నుంచి పొగరావడం వెంటనే మంటలు వ్యాపించడంతో వెంటనే రైస్ మిల్ ఓనర్ కు, ఫైర్ డిపార్ట్ మెంట్ కు సమాచారం అందించారు. ఈ ఘటనా స్థలాన్ని అడిషనల్ కలెక్టర్, డిప్యూటీ తహసీల్దార్, తహసీల్దార్, సీఐతో పాటు పలువురు అధికారులు పరిశీలించారు. అగ్నిప్రమాద వివరాలు తెలుసుకున్నారు. కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు.

దీంతో సమీప జిల్లాల్లో ఉన్న ఫైర్ ఇంజన్లు అన్ని వెంటనే అక్కడకు చేరుకున్నాయి.. మిల్లు వెనక ఉన్న ఓ గోడను సిబ్బంది తొలగించారు. దాని ద్వారా మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కానీ అప్పటికే భారీ నష్టం జరిగింది. 15 వేల క్వింటాళ్ల ధాన్యం, 5 వేల క్వింటాళ్ల బియ్యం మంటల్లో కాలి బూడిద అయ్యాయని సమాచారం. ఇక రూ.2 కోట్ల విలువైన మిషిన్లు కాలిపోయాయి. ఈ ప్రమాదంలో కాలిపోయిన తరువాత మిగిలిన ధాన్యాన్ని స్థానికంగా ఉన్న మరో రైస్ మిల్ కు తీసుకెళ్లారు. మంటలని అదుపులోకి తీసుకురావడానికి సిబ్బంది చాలా కష్ట పడ్డారు. ఇలా తెలంగాణ లో వరుస అగ్ని ప్రమాధాలకు కారణం తెలపాలని జనాలు డిమాండ్ చేస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment